22-09-2025 01:10:58 AM
తగ్గించకపోతే స్థానిక ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పటం ఖాయం
విశ్వహిందూ పరిషత్ నేతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి)ః దసరా పండుగకు హిందువులపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని వేయడం తగదని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి, పచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పం డుగ సందర్భంగా ఆర్టీసీ బస్సు చార్జీలు 50 శాతం పెంచడాన్ని వారు తప్పుబట్టారు. బస్సు చార్జీలు పెంచి, పేద ప్రజలకు తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారన్నారు.
ముస్లిం ల పండుగలకు రాయితీలు కల్పిస్తు న్న కాంగ్రెస్ ప్రభుత్వం.. హిందువుల పండుగలకు పన్నుల మీద పన్నులు వేసి తీవ్ర భారం మోపుతున్నదని వీహెచ్‌పీ నేతలు ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్ప డుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే ఈ చర్యను ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ చార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలని వీహెచ్‌పీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి హిందువులు రిటన్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.