16-08-2025 12:07:38 AM
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని శ్రీనివాస నగర్ గీతాంజలి విద్యానికేతన్ పాఠశాలలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ టీ. పద్మ, టీ అరుణ్ దేశనాయకుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పా రావు జాతీయజెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు చక్కటి ఉపన్యాసాలు ఇచ్చారు.