16-08-2025 12:25:27 AM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలంలోని సెయింట్ పాల్స్ పాఠశాల ఆవరణలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్రావు ముఖ్య అతిధిగా విచ్చేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేస్తూ, పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులను గతసంవత్సరం సాధించిన ప్రగతితో పాటు, ఈ సంవత్సరం కూడా విద్యారంగంలో అన్ని అంశాల్లో అగ్రగామిగా నిలవాలని ఆశిస్తూ, అభినందించారు.
అనంతరం పాఠశాల ప్రిన్నిపాల్ డా, కె. అబ్రహం హెడ్మాస్టర్ శ్రీమతి. కే రాధామంజరి, ఈ నాడు ప్రదర్శించిన 'జాతీయ సమగ్రత - పరేడు"లో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ, "జాతీయ-సమగ్రత ప్రాముఖ్యతను తెలియ జేసినందుకు విద్యార్థులను ఆశీర్వదించారు.
అదే విధంగా పాఠశాల డైరెక్టర్లు ఎస్. రాజేష్ & డా. కె. అలీన శాంతి పరేడు ద్వారా స్వాతంత్ర్య ఉద్యమ దినోత్సం కార్యక్రమాన్ని సాంసృతిక కార్యక్రమాలతో ప్రదర్శించినందుకు విద్యార్థులను, అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్యక్రమాన్ని విజయ వంతం చేయటంలో పాత్ర పోషించిన ఉపాధ్యాయులకు, సహకరించిన తల్లి తండ్రులకు అభినందనలు తెలియజేశారు.