16-08-2025 12:25:21 AM
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్య క్షురాలు కవిత తన తండ్రి కేసీఆర్‌ను శుక్రవారం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో కలిశా రు. తన చిన్న కుమారుడు ఆర్యను గ్రాడ్యుయేషన్‌లో చేర్పించేందుకు శనివారం కవిత అమెరికాకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కుమారుడికి తాత కేసీఆర్ ఆశీర్వాదం కోసం ఫాంహౌజ్ వెళ్లారు. అక్కడే సుమారు గంటపాటు ఉండి కేసీఆర్‌తో సమావేశమయ్యా రు.
తల్లితో మాట్లాడి, తల్లిదండ్రుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం అక్కడే లంచ్ చేసి, పలు విషయాలపై చర్చించారు. ఆతర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగివచ్చారు. అయితే ఆమె వెళ్తున్న క్రమంలోనే కేటీఆర్, హరీశ్‌రావు ఎదురుపడినట్లుగా తెలిసింది.
కవితకు, కేటీఆర్‌కు మధ్యగ్యాప్ వచ్చి నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ ఎదురుపడటంపై ఆసక్తి నెలకొన్నది. కాగా తన కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు కవిత అమెరికా వెళ్తున్న కవిత.. 15 రోజులపాటు అమెరికాలోనే పర్యటించనున్నారు. శనివారం ఉదయం శంషా బాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు ఆమె ప్రయాణం కానున్నారు. సెప్టెంబర్ 1న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ
పార్టీ కీలక నేతలతో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు రావాలని ఆదేశించడం తో శుక్రవారం కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వినోద్‌లతోపాటు ముఖ్య నేతలు చేరు కున్నట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్ని క, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ఇటీవల కాలంలో బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారంటూ సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు కేసీఆర్ సూచించినట్లుగా తెలిసింది.