16-08-2025 12:05:17 AM
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాం తి): స్వాతంత్య్ర దినోత్సవమంటే క్యాలెండర్‌లో ఒక తేదీ మాత్రమే కాదని, దేశం కష్టపడి సంపాదించుకున్న స్వేచ్ఛను గౌరవించే పవిత్ర సందర్భ మని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభివర్ణించారు. రాజ్‌భవన్‌లో శుక్రవారం జరిగిన 79వ స్వా తంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు, దేశ పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
స్వాతంత్య్ర సమరయోధుల త్యా గాలు స్వతంత్ర భారతదేశానికి పునాది వేశాయని, మహాత్మాగాంధీ నేతృత్వంలోని అ హింసా, సత్యాగ్రహం యొక్క శాశ్వత సూత్రాలను గుర్తుచేశారు. మహనీయులు చూపిన మార్గం ‘ఒక సామ్రాజ్యాన్ని కదిలించి, తరతరాలకు స్ఫూర్తినిచ్చాయి’ అని పేర్కొన్నా రు. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడంతోపాటు దాని స్థిరమైన పెరుగుదలను గవర్నర్ నొక్కి చెప్పారు.
నీటిపారుదల, సాంకేతికత, కృ త్రిమ మేధస్సు, ఔషధాలు, బయోటెక్నాలజీలలో తెలంగాణ సాధించిన విజయాలను ఆయన ప్రశంసించారు. అలాగే సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రశంసింస్తూ ‘ఆపరేషన్ సిందూర్’ దేశం యొక్క సంకల్పం, సామర్థ్యానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం గవర్నర్ పుట్టినరోజు కావడంతో అధికారులు, సిబ్బంది ఆయనకు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమా న్ని ఘ నంగా నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనేటి విందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలును సీఎం తెలియజేశారు.