calender_icon.png 16 August, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహ వేడుకల్లో పాల్గొన్న కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి

16-08-2025 06:14:21 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలంలోని బొమ్మపూర్ గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేమునూరు రవీందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకల్లో శనివారం కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, మన పెద్దలు సీనియర్ నాయకులు ఇచ్చిన మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంటుందని, అందరి కుటుంబ సభ్యుల సంతోషాలతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. స్థానిక నాయకులు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.