calender_icon.png 16 August, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏచూరి సంస్మరణ సభ విజయవంతం చేయాలి

16-08-2025 06:09:58 PM

సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ హాజరు..

జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 19 మంగళవారం సిపిఎం పార్టీ అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ కామారెడ్డి పట్టణంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జరుగుతున్నదని దీనికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ(CPM Party State Secretary John Wesley) హాజరవుతున్నారని ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, పార్టీ శాఖ కార్యదర్శులు, సభ్యులు, పార్టీ శ్రేణులు రైతులు, కార్మికులు, విద్యార్థి యువజనులు, అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రశేఖర్ కోరారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు 6 వెంకట్ రాములు కూడా హాజరవుతున్నారని తెలిపారు. 

సీతారాం ఏచూరి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మాత్రమే నాయకుడిగా కాకుండా ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలకు ఒక దిక్సూచి లాగా మార్గదర్శిలాగా పనిచేశాడని అన్నారు. దేశం కోసం దేశ ప్రజలు రైతాంగం కార్మికుల కోసం అట్లాగే ప్రపంచ కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలని నిర్మించిన వ్యక్తి అని భారత పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నాడని పార్లమెంటు ఉద్దేశించి ఏచూరి చేసిన ప్రసంగం దేశ భవిష్యత్తుకు యువతరానికి మార్గదర్శిలాగా పనిచేస్తుందని తెలిపారు.  ఆయన లేని లోటు తీర్చలేనిదని హేచురు కి నివాళులు అర్పించడం అంటే ఆయన చూయించిన బాటలో ముందుకెళ్లడమేనని తెలిపారు. 

విద్యార్థి దశలోనే ఢిల్లీలోని చరిత్ర ఆత్మక జేఎన్యు విద్యార్థి సంఘం అధ్యక్షులుగా గెలిచి అనేక విద్యార్థి ఉద్యమాలను నిర్మించిన వ్యక్తిగా ఎమర్జెన్సీ సమయంలో అరెస్టులకు భయపడకుండా ఇందిరా గాంధీ ఇంటి ముందు ధర్నా నిర్వహించి జేఎన్యూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు కాబట్టి అంతటి మహనీయుని మనం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన బాటలో నడవాలని 19న జరిగే కార్యక్రమాన్ని జిల్లాలోని రైతులు కార్మికులు యువజనులు అట్లాగే ఏ చోరీ  అభిమానులు అందరు కూడా హాజరై విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు వెంకట్ గౌడ్ మొతీరాం నాయక్ కొత్త నరసింహులు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.