calender_icon.png 17 August, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వగురు భయంతోనే ట్రంప్ అదనపు సుంకాలు

16-08-2025 12:03:07 AM

  1. ట్రంప్ టారిఫ్‌లకు భారత్ భయపడేదే లేదు
  2. చాయ్‌వాలా మోదీ.. ఎర్రకోటపై 12 సార్లు జెండా ఆవిష్కరించారు..
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు
  4. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): భారత్ విశ్వగురుగా మారుతున్నదన్న భయంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మం త్రి బండి సంజయ్‌తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

అమెరికా వాజ్‌పేయ్ హయాంలో నూ దేశంపై అనేక ఆంక్షలు విధించిందని, అయినప్పటి కీ పోఖ్రాన్ అణుపరీక్షలు ఆపలేకపోయిందని గుర్తుచేశారు. ట్రంప్ సుంకాలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. మోదీ ప్రధాని అయ్యాకే భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. దేశం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుంటే కొన్ని దేశాలు ఓర్వలేకపోతున్నాయని దుయ్యబట్టారు.

స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మహాత్మాగాంధీ స్వదేశీ వస్తువు లు వాడాలని పిలుపునిచ్చారని, ప్రస్తుత పరిస్థితులు చూ స్తుంటే.. మళ్లీ ఆ రోజులు వస్తాయనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నెహ్రూ వరు సగా 17సార్లు జాతీయ జెండాను ఆవిష్కరించారని, కాం గ్రెసేతర ప్రధానిగా మోదీ వరుసగా 12వసారి అక్కడ జెండా ఎగురవేసి రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. ఎర్రకోటపై జెండా ఎగరవేయడం నెహ్రూ కుటుంబ హ క్కుగా భావించేదని,

కానీ ఒక చాయ్‌వాలా మోదీ వరుసగా 12సార్లు జాతీయ జెండాను ఆవిష్కరించడం దేశానికే గర్వకారణమన్నారు. దేశ విభజన సందర్భంగా దేశంలో చోటుచేసుకున్న విషాద గాయాలను గుర్తుపెట్టుకునాల్సిన అవసరం ఉందని, పోరాటయోధుల త్యా గాలను స్మరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు అందరూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. వేడుకల్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి,  రాము లు,  ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, నేతలు కాసం వెంకటేశ్వర్లు, ఎన్వీ సుభాష్, మనోహర్‌రెడ్డి, శిల్పారెడ్డి, గందమళ్ల ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.