16-08-2025 12:05:30 AM
మెదక్, ఆగస్టు 15(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. ఎ. రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసిన తెలంగాణ వీరులకు జేజేలు పలుకుతూ, ఈ పోరాటంలో తమ ప్రాణాలు త్యాగం చేసిన తెలంగాణ అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించారు.
మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలపాలని కోరారు. అనంతరం ప్రగతి నివేదికను వివరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి, డిఆర్‌ఓ భుజంగరావు, వివిధ శాఖలకి చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...
మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు జాతీయ జెండావిష్కరించారు. అనంతరం త్యాగధనుల త్యగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ కార్యాలయంలో...
బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి జెండావిష్కరించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ కార్యాలయంలో..
జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్ గౌడ్ జెండావిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, సుభాష్గౌడ్, ఎంఎల్‌ఎన్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేగుంటలో..
చేగుంట మండల కేంద్రంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో చిన్నారెడ్డి, ఎస్‌ఐ చైతన్యకుమార్ రెడ్డి, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు వారి కార్యాలయాల్లో జెండావిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు.
తూప్రాన్‌లో..
తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ శ్రీకాంత్, తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్లో డీఎస్పీ, ఆయా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్ జెండావిష్కరించారు. వివిధ రాజకీయ పార్టీ కార్యాలయా ల్లో పార్టీ అధ్యక్షులు జెండావిష్కరించారు.
వెల్దుర్తిలో...
వెల్దుర్తి మండల కేంద్రంలో ఎంపీడీవో ఉమాదేవి, తహసీల్దార్ బాలలక్ష్మీ, ఎస్‌ఐ రాజు, పంచాయతీ ఈవో బలరాంరెడ్డి, ఏవో ఝాన్సి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. అలాగే వివిధ పార్టీ నాయకులు జెండావిష్కరించారు.
మనోహరాబాద్‌లో..
మనోహరాబాద్ మండలంలో ఎంపీడీవో రవీందర్, ఎస్‌ఐ సుభాష్గౌడ్, ఏవో స్రవంతి, డాక్టర్ జోశ్న, టోల్ ప్లాజా వద్ద ఐఎన్టీయూసీ నాయకుడు చిటుకుల మహిపా్ర లెడ్డి జాతీయ జెండివిష్కరించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఃమంత్రి దామోదర రాజనర్సింహ..
సంగారెడ్డి, ఆగస్టు 15(విజయక్రాంతి): 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు చదివి వినిపించారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. రెండు లక్షల రుణమాఫీని జిల్లాలో 1.04,416 కుటుంబాలకు రూ.910 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు. రైతు బీమా కింద 2024-25లో నిపోయిన 1400 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.70 కోట్లు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. గతంలో ధరణితో ఇబ్బంది పడ్డ రైతులకు భూ భారతితో సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
ఉచిత బస్సు, గృహజ్యోతి, రూ.500 గ్యాస్లాంటి పథకాలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామని తెలిపారు. సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జిల్లా పంచాయతీ రాజ్, విద్యా శాఖ, వ్యవసాయ శాఖ, డీఆర్డీవో, ఆరోగ్య సంబంధిత పథకాలు, పోలీస్ శాఖ, మున్సిపల్, రెవిన్యూ శాఖల శకటాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు మంత్రి ప్రశంస పత్రాలను అందజేశారు. పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ, మిషన్ భగీరథ, మెప్మా, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను మంత్రి, టీజిఐఐసి చైర్మెన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ సంచార విజ్ఞాన ప్రయోగశాల వాహ నాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే హోమ్ అఫైర్స్ విభాగం మొబైల్ ఫోరెన్సిక్స్ వ్యాన్, క్లూస్ టీమ్ వాహనాన్ని కూడా ప్రా రంభించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లో..
నారాయణఖేడ్ పట్టణంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి తన కార్యాలయంలో జెండావిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల చౌక్ వద్ద జహీరాబాద్ ఎంపీ సురేశ్కుమార్ శెట్కార్, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరావు, బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, బీజేపీ కార్యాలయంలో విజయపాల్రెడ్డి జెండావిష్కరించారు.
జహీరాబాద్‌లో..
జహీరాబాద్ పట్టణంలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్యరావు, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో, పోలీస్ స్టేషన్లో డీఎస్పీ, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, పార్టీ కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు ఎగురవేశారు. మాచనూరులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు పోటాపోటీగా ఎదురెదురుగా జెండావిష్కరించారు. అనంతరం ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు బీఆర్‌ఎస్ నాయకులు రూ.5వేలు నగదు అందజేశారు.
కొండాపూర్‌లో..
కొండాపూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ అశోక్, ఎంపీడీవో సత్తయ్య, డాక్టర్ అనుదీప్, సీఐ సుమాన్కుమార్, ఎస్‌ఐ సోమేశ్వరి, వివిధ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు.
అభివృద్ధి పథంలో తెలంగాణ: మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట, ఆగస్టు 15 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతుందని ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో శుక్రవారం జరిగిన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి మాట్లాడారు.
ప్రజా పాలన ప్రభుత్వంగా అర్హులందరికీ రేషన్ కార్డులు, కొత్త కుటుంబ సభ్యుల పేర్ల చేర్పులు, సవరణలు నిరంతరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి, ఒక్కింటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా ఇప్పటివరకు రూ.200 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు.
రైతు భరోసా కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు పంపిణీ చేసి, రైతు రుణమాఫీ పూర్తిచేశామని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి, అదనపు చికిత్సలను చేర్చినట్లు వెల్లడించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ 6 కిలోల సన్నబియ్యం అందించే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ సన్న వడ్లకు రూ.500 బోనస్ మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. ఈ నెలలో నర్మేట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని, రైతులు ఆయిల్ పామ్ సాగు చేసి అధిక ఆదాయం పొందాలని సూచించారు.
చెరువుల్లో చేప పిల్లల పంపిణీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా క్యాంటీన్లు, సోలార్ బస్సుల వంటి పథకాలను ప్రస్తావించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని, జిల్లాను రోడ్లు, మౌలిక వసతుల రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. పల్లె, బస్తీ దవాఖానల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామని, హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీ రింగ్ కాలేజీ తరగతులు ప్రారంభమయ్యాయని చెప్పారు.
త్వరలో కబడ్డీ అకాడమీ, గురుకులాల్లో మెస్ చార్జీలు పెంపు, సఖి కేంద్రాలు, చేనేత, జౌళి కేంద్రాలకు మద్దతు, పట్టణ పేదరిక నిర్మూలన పథకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఈత మొ క్కలు, 5 లక్షల తాటి మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని, ఎవరైనా మత్తుకు బానిస అయితే 1908 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
రాష్ట్ర భవిష్యత్తు బాగుం డాలంటే ప్రతి తెలంగాణ బిడ్డ ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. వివిధ శాఖల అధికారులు ఏర్పాటుచేసిన స్టాల్స్ ని సందర్శించారు. యాంటీ డ్రగ్స్ కు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద ఫోటో దిగారు.
పలువురు అధికారులు ఆయా రం గాలలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ప్రశంస పత్రం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హై మావతి, పోలీస్ కమిషనర్ అనురాధ, అదనపు కలెక్టర్లు గరీమగర్వాల్, అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి వివిధ శాఖల అధికారులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
వీరుల త్యాగఫలమే స్వతంత్య్ర భారతం
జిన్నారం(గుమ్మడిదల), ఆగస్టు 15 : స్వాతంత్య్ర అమరవీరుల త్యాగం మరువలేని దని, వారి వీరపోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తాజా మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ తెలిపారు. గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామంలో 79 వ స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనం గా నిర్వహించారు.
అమరవీరుల స్తూపం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంబేద్కర్ విగ్రహం వివిధ కార్యాలయాలను రంగురంగు జెండాలతో శోభాయ మానంగా తీర్చి దిద్దుకున్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాజు గౌడ్, మాజీ వాడు సభ్యులు రాజేందర్ సింగ్, కుమార్, దశరథ్ సింగ్, మల్లేష్, స్వామి, విజయ్ గౌడ్, నరేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, గ్రామస్తులుపాల్గొన్నారు.
యావాపూర్‌లో..
తూప్రాన్, ఆగస్టు 15 : తూప్రాన్ మండలం యావపూర్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గ్రామ యువకులు, గ్రామస్తులు జరుపు కున్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా గత మూడు సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకొని ప్రాథమిక పాఠశాలకు అవసర నిమిత్తం సౌండ్ సిస్టమును ఉపయోగించుకోవడానికి సంఘ సేవకుడు కుతాడి నరసిం హులు పాఠశాల సిబ్బందికి విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నా యకుడు ఎంజాల స్వామి మాట్లాడుతూ గత కొంతకాలంగా గ్రామంలో అసౌకర్యంగా ఉన్న ప్రతి చోట నేనున్నానంటూ కావలసిన వనరులను సమకూరుస్తూ సహాయాన్ని అం దిస్తున్నాడని అభినందించారు.
ఇందులో భాగంగా కుతాడి నరసింహులును శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపిటిసి ఏంజాల స్వామి, చెట్లపల్లి రామస్వామి, శంకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, ఎంజాల బిక్షపతి, నాగరాజు, బక్కని లక్ష్మణ్, ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు.