calender_icon.png 9 May, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహల్గాం ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందనకు శ్రీకారం

08-05-2025 01:34:57 AM

-ఆపరేషన్ సింధూర్‌తో దాయాది దేశానికి వార్నింగ్ 

-బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

కరీంనగర్, మే 7 (విజయక్రాంతి) : పహల్గంలో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందన కు శ్రీకారం చుట్టిందని, పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై” ఆపరేషన్ సిందూర్‌” పేరుతో  మెరుపు దాడులు చేసి , దేశ సత్తా చాటిన ఇండియన్ ఆర్మీకి, ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి బిజెపి కరీంనగర్ జిల్లా పక్షాన సెల్యూట్ చేస్తున్నామని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు.

ఆపరేషన్ సింధూర్  పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు ప్రారంభించిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో  కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిజెపి శ్రేణులు అన్ని దేవాలయాల్లో  ప్రత్యేక,  పూజలు నిర్వహించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఇల్లంతకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ లు చేపట్టారు. ఈ సందర్భంగా గంగా డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారతీయుల రక్తం మరిగిపోయిందన్నారు.

ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని, మన నేలపై దాడి చేస్తే, శాంతికి విఘాతం కలిగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో దాయాది దేశానికి, ఉగ్రముకలకుతెలిసి వచ్చేలా ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన మెరుపు దాడుల తో సమాధానం చెప్పిందన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరిట చేపట్టిన మెరుపు దాడులు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా జరిగాయన్నారు.

ఆపరేషన్ సింధూర్‌కు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని, సోషల్ మీడియా వేదికగా మేరా భారత్ మహాన్, జైహింద్ అని మద్దతు తెలియజేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, మాజీ సర్పం సురేందర్ రెడ్డి, ఆకుల రాజేందర్, సంపత్ రావు, రాంబాబు, షపి, దేవేందర్, విజయ్, సమ్మయ్య, దుర్గయ్య, సాయిరెడ్డి, చుక్కల్ రెడ్డి, గోపాల్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.