calender_icon.png 14 September, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్ర సృష్టించిన భారత్

14-09-2025 01:02:48 AM

  1. డేవిస్‌కప్‌లో స్విట్జర్లాండ్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టు
  2. కీలకపాత్ర పోషించిన సుమిత్ నాగల్
  3.   2026 డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత

బీల్, సెప్టెంబర్ 13: స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న డేవిస్ కప్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. శనివారం స్విట్జర్లాండ్‌తో జరిగిన పోరులో 3-1 తేడాతో గెలిచి విజయవంతంగా పోరును ముగించింది. ఈ విజయంతో భారత్ 2026లో జరిగే క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. యూరోప్ గడ్డపై జరిగిన డేవిస్ కప్ పోరులో ఓ యూరోపియన్ జట్టుపై భారత్ గెలవడం 32 సంవత్సరాల అనంతరం ఇదే ప్రథమం.

చివరిసారిగా 1993లో ఫ్రాన్స్ మీద భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ సుమిత్ నగల్ అద్భుత ప్రదర్శన చేశాడు. అంతగా అనుభవం లేని దక్షిణేశ్వర్ సురేష్ స్విస్ నం.1 ఆటగాడు జెరోమ్ కిమ్‌ను శుక్రవారం కంగుతినిపించి భారత్‌కు విజయం రుచిచూపించాడు. టోర్నీ ప్రారంభానికి ముందు సురేష్ ఆడతాడా రిజర్వ్ ప్లేయర్‌గా ఉంటాడా? అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆడే అవకాశం దక్కించుకున్న సురేష్ ఎవరూ ఊహించని రీతిలో రెచ్చిపోయాడు.

ఇక తొలి గేమ్‌లో సుమిత్ నగాల్ మార్క్ హస్లర్‌ను ఓడించాడు. 2-0 ఆధిక్యంతో రోజును ప్రారం భించిన భారత బృందానికి అనుకోని షాక్ తగిలింది. స్విట్జర్లాండ్ డబుల్స్‌లో విజయం సాధించడంతో గేమ్‌పై ఆశలను సజీవంగా నిలుపుకుంది. జాకబ్ పాల్- డొమినిక్ స్ట్రికర్ ధ్వయం శ్రీరామ్ బాలాజీ-రిత్విక్ జోడీపై విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ జం టనే విజయం వరించింది.

ఆ తర్వాత జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో సుమిత్ నగాల్ విజ యం సాధించి భారత జట్టుకు అపురూప విజయం దక్కేలా చేశాడు. సుమిత్ నగాల్ స్విట్జర్లాండ్‌కు చెందిన 18 ఏండ్ల హెన్రీ బెర్నెట్ మీద 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. డేవిస్ కప్ లో ఇండియా ఇప్పటివరకు మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత్ 2026లో జరిగే డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది.