06-10-2025 12:38:40 AM
మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం
హైదరాబాదు సిటీ బ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారిణి శ్రీయాంశి వలిశెట్టి అద్భుత ప్రదర్శనతో అల్ ఐన్ మాస్టర్స్-2025 మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఖలీఫా బిన్ జాయెద్ స్టేడియంలో జరిగిన ఈ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ టోర్నమెంట్‌లో ఆమె విజేతగా నిలిచింది.
సెమీఫైనల్లో ఏడో సీడ్ శ్రీయాంశి, ఇండోనేషియాకు చెందిన చియారా మార్వెల్లా హాండోయోపై 21 21 గెలిచి ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో మాజీ ప్రపంచ జూనియర్ నంబర్ 1 తస్నీం మీర్‌ణు 15 22 21 తేడాతో ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.
కేవలం 18 ఏళ్ల వయసులోనే ఈ విజయంతో శ్రీయాంశి తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ సూపర్ 100 టైటిల్‌ను సాధించి విశేష గుర్తింపు పొందింది. ఆమె ప్రతిభ, పట్టుదల, ధైర్యం ఈ విజయానికి మూలమని భారత బ్యాట్మెంటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభినందించి సంతోషాన్ని వ్యక్తం చేశారు.