calender_icon.png 25 July, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ ర్యాంక్ 77

24-07-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, జూలై 23: ప్రపంచంలో అత్యం త శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ స్థానం కాస్త మెరుగుపడింది. గతేడాది 80వ స్థానంలో ఉన్న భారత్.. ఈసారి మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 77వ ర్యాంక్‌లో నిలిచింది. అయితే వీసా రహిత ప్రయాణాల్లో 62 నుంచి 59కి తగ్గింది. వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా పాస్‌పోర్టు శక్తిని లెక్కించి న హెన్లీ సంస్థ పాస్‌పోర్టు సూచీ-2025ను విడుదల చేసింది.

సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. ౧౯౦ దేశాల్లో వీసా రహిత ప్రయాణాలతో జపాన్, దక్షిణ కొరియా రెండో స్థానంలో ఉండగా.. డెన్మార్క్, ఫి న్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పె యిన్‌లు మూడో స్థానంలో ఉన్నాయి.