calender_icon.png 26 July, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు.. విచారణ నుంచి తప్పుకొన్న సీజేఐ గవాయ్

24-07-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, జూలై 23: అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు.ఈ విషయం పలు రాజ్యాంగ సమస్యలను లేవనెత్తుతుండడం వల్ల తమ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారించాలని జస్టిస్ వర్మ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సర్వోన్న త న్యాయస్థానాన్ని కోరారు.

విచారణ కమిటీలో తాను కూడా సభ్యుడిగా ఉన్నందున ఈ కేసును విచారించబోనని సీజేఐ స్పష్టం చేశారు. తాజాగా జస్టిస్ గవాయ్ వైదొలగడంతో ఈ కేసు విచారణకు ప్ర త్యేక బెంచ్ ఏర్పాటు చేయడానికి సుప్రీంకో ర్టు చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీలోని తన నివాసంలో జస్టిస్ యశ్వంత్ నోట్ల క ట్టలతో దొరికినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.