calender_icon.png 6 October, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

06-10-2025 12:40:12 AM

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో వరుసగా రెండో విజయం

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 88 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది.

హర్లీన్ డియోల్ (46) రిచా ఘోష్ (35) రాణించారు. లక్ష్యఛేదనలో పాక్.. 43 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. సిద్రా అమీన్ (81) చివరి వరకు పోరాడింది. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 3, దీప్తి శర్మ 3, స్నేహ్ రాణా 2 వికెట్లు పడగొట్టారు.