21-05-2025 12:49:23 AM
మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
మేడ్చల్, మే 20(విజయ క్రాంతి): ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో భారత ఖ్యాతి ఎంతో పెరిగింద ని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం మేడ్చల్ లో జిల్లా బిజెపి ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం నుంచి మార్కెట్ వరకు నిర్వహించిన తిరంగా యా త్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత సైనికులకు, ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపడానికి యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.
ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి మేము మీ వెంట ఉన్నామని సైనికులకు మద్దతు ఇవ్వాలన్నారు. పాకిస్తాన్ భారత్ ఎదుగుదలను ఓరువలేకే ఉ గ్రవా దులతో దాడులు చేయిస్తుందన్నారు. ప్రజలకు సరైన ఆహారం అందించకుండా భారత్ పై కుట్ర లు చేస్తోందని విమర్శించారు.
భారత సార్వభౌమాధికారం పై కన్నేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. భారత్ అన్ని రకాలగా శక్తివంతమైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్, పాతూరు సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.