calender_icon.png 21 May, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీఐ కమిషన్‌లో బీసీలకు అన్యాయం

21-05-2025 12:50:38 AM

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు బీసీనేతల వినతి 

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి) : రాష్ట్ర సమాచార హక్కు చట్టంలో బీసీలకు అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చిన సమాచార కమిషన్‌లో ఇద్దరు ఓసీలు, ఒక ఎస్సీ, ఒక మైనార్టీకి అవకాశం ఇచ్చారని, బీసీలను విస్మరించారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగ ణనలో బీసీలు 56 శాతం ఉన్నట్లుగా తేలిందని, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42శాతం కల్పిస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం భర్తీచేసే పోస్టుల్లోనూ బీసీలకు న్యాయం చేయాలని, లేదంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయన్నారు.

మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి వారిలో బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలగోని బాలరాజ్‌గౌడ్, బీసీ విద్యార్థి సం ఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ, నాయకులు అయిలి వెంకన్న, ఎలికట్టు విజయ్‌కుమార్, ఇంద్రం రజక, భాస్కర్ తదితరులు ఉన్నారు.