calender_icon.png 21 May, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంతల మయంగా మారిన రోడ్డు

21-05-2025 12:46:57 AM

ఇబ్బంది పడుతున్న వాహనదారులు 

మేడ్చల్, మే 20(విజయ క్రాంతి): పట్ట ణంలోని శివాలయం రోడ్డు పూర్తిగా గుం తల మయంగా తయారయింది. కె ఎల్ ఆర్ శివాజీ విగ్రహం నుంచి శివాలయం మీదు గా ప్రధాన రోడ్డు వరకు అధ్వానంగా త యారైంది. గుంతలు ఏర్పడడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. గుంతలు ఎక్కువగా ఉండటం వల్ల నడుము నొప్పి బారిన పడుతున్నారు.

వ ర్షం కురిసినప్పుడు గుంతలలో నీరు ఉండ డం వల్ల ఏర్పడడం లేదని, వాహనాలు అదుపుతప్పుతున్నాయని వాహనదారులు తెలిపారు. అంతేగాక ఈ రోడ్డుమీద స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా ఉన్నాయి. మర్యాద రామ న్న హోటల్, శివాజీ విగ్రహం మధ్యలో కొత్తగా స్పీడ్ బ్రేకర్ వేశారు.

మూల మ లుపులో ప్రమాదకరంగా ఉంది. అంతేగాక ఎత్తుగా ఉంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని, ప్రమా దకరంగా ఉన్న స్పీడ్ బ్రేకర్ ను తొల గించాలని వాహనదారులు కోరుతున్నారు.