calender_icon.png 19 November, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల అదృశ్యం

19-11-2025 07:22:34 PM

తల్లిదండ్రుల  తీవ్ర ఆందోళన

12 గంటల తర్వాత లభించిన ఆచూకీ

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధి  ఎన్టీఆర్ కాలనీలో ఉన్న పెద్దెముల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల,కళాశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు  బుధవారం తెల్లవారుజాము నుండి అదృశ్యమయ్యారు. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం కోటపల్లి మండలం మోత్కుపల్లి  గ్రామానికి చెందిన వినయ్ కుమార్ 8 వ తరగతి, హర్షవర్ధన్ 9వ తరగతి చదువుతున్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు పాఠశాల నుండి బయటికి వెళ్లారు.

విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు మీ ఇంటికి గనక వస్తే మాకు తెలియజేయాలని విద్యార్థుల తల్లిదండ్రులతో కోరారు. మధ్యాహ్నం 12 అవుతున్న విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠశాల నిర్వాహకులను గట్టిగా నిలదీశారు. స్కూల్ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల కేంద్రంలో విద్యార్థుల రాజకీయ లభించినట్లు పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు వెళ్లారు.