19-11-2025 07:22:48 PM
నకిరేకల్ (విజయక్రాంతి): జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ మాసపత్రిక సౌజన్యంతో ఈ నెల 21న చెకుముకి మండల స్థాయి సైన్స్ పండగ నకిరేకల్ పట్టణంలోని గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు కనుకుంట్ల విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నకిరేకల్ డివిజన్ లోని చిట్యాల, నార్కట్ పల్లి, కట్టంగూరు, నకిరేకల్, కేతపల్లి, శాలిగౌరారం మండల కేంద్రాలలో మండల స్థాయి సైన్స్ సంబరాలు జరుగుతాయని తెలిపారు. పాఠశాల స్థాయిలో ఎంపికైన స్కూల్ టీం మండల స్థాయి చెకుముకి సంబరాలలో పాల్గొనవలసి ఉంటుందన్నారు.
ఈ సంబరాలలో విద్యార్థులు చేసిన సైన్స్ ప్రయోగాలు, సైన్స్ ప్రదర్శనలు ఉంటాయన్నారు సాంస్కృతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన మూడు జట్లను ఈనెల 28న జిల్లా కేంద్రంలో జరిగే సంబరాలకు మండల ప్రతినిధిగా పంపడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో జె వి వి జిల్లా ఉపాధ్యక్షుడు వాలుగొండ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి గంగాధరి భద్రయ్య, జిల్లా కమిటీ సభ్యులు వంటెపాక నగేష్, యానాల కోకిల, రాపోలు రఘు, అల్లం శంకర్, మండల కమిటీ బాధ్యులు బెల్లి ఆంజనేయులు, పున్న రాంప్రసాద్, నర్సిరెడ్డి, చల్లోజు శ్రీనివాస్, కురిమిళ్ళ శ్రీనివాస్, బుడిగే సుధాకర్, ఉదయశ్రీ, విజయలక్ష్మి పాల్గొన్నారు.