20-11-2025 12:00:00 AM
ఇందిరా గాంధీ జయంతిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్
మంథని, నవంబర్19(విజయ క్రాంతి) భారత దేశ అభివృద్ధికి ఇందిరాగాంధీ చేసిన సేవలు మరువలేనివని మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ అన్నారు.రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు సూచన మేరకు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలోభారతరత్న, ఉక్కు మహిళ, తొలి మహిళా, ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయంలో శ్రీమతి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసికాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్ ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, మాజీ ఎంపీపీ కొండ శంకర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గోట్కారి కిషన్ జి మాట్లాడుతూఇందిరా గాంధీ దేశ తొలి మహిళా ప్రధాని గా, కేంద్ర మంత్రి గా, పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకురాలు గా, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గా శ్రీమతి ఇందిరా గాంధీ భారత దేశ ప్రజలకు అనేక సేవలను అందించారన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.