20-11-2025 12:00:00 AM
చేపల పంపిణీ కార్యక్రమంలో సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి,నవంబర్19 (విజయక్రాంతి): అట్టడుగు వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించడమే మా ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. వెల్గ టూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలో గురువారం 100% సబ్సిడీపై ఉచిత చేప పిల్లల కార్యక్రమాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జిల్లా మత్స్యశాఖ అధికారి కె. సురేష్ బా బులతో కలిసి మత్స్యశాఖ అధికారి కె.సురేష్ బాబు లతో కలిసి ఆయన అట్టహాసంగా ప్రారంభించారు.
అనంతరం వెల్గటూర్ మండలానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ లు అధికారులతో కలిసి అందజేసారు. కార్యక్రమానికి ముం దుగా మంత్రి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందనీ,గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చేపల పెంపకం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
అందుకే ప్రభుత్వం 100% సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేస్తోందనీ చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాల పెంపు, మార్కెట్ సదుపాయాల విస్తరణ ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్స్యకార కుటుంబాల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గ్రామానికి విస్తరిస్తమన్నారు. స్తంభంపల్లి గ్రామం మత్స్యోత్పత్తిలో మరింత అభివృద్ధి చెందాలని ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాంపెల్లి శేఖర్, ఎంపీడీవో పాడి వెంకట్ ప్రసాద్, వ్యవసాయాధికారి పి.సాయి కిరణ్, ఎంపీవో కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి, మార్కెట్ కమీటీ వైస్ ఛైర్మెన్ అనుమల్ల తిరుపతి,నాయకులు గండ్ర శ్రీకాంత్ రావు,గుండేటి సందీప్ రెడ్డి,బందేల ఉదయ్ గౌడ్,గుమ్ముల వెంకటేష్, మేడి మల్లేష్, మేరుగు నరేష్ గౌడ్,మేడి మల్లేష్ తదితరులుపాల్గొన్నారు.