20-11-2025 12:00:00 AM
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి శ్రీధర్ బాబు
మణికొండ, నవంబర్ 19, విజయక్రాంతి : మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.121 కోట్ల భారీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మున్సిపల్ సాధారణ నిధులు రూ.18.40 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని నింపే లక్ష్యంతో రూ.3.05 కోట్ల వ్యయంతో నిర్మించిన క్రికెట్ స్టేడియంను మంత్రి ప్రా రంభించారు. అలాగే వరద ముంపు సమస్య పరిష్కారానికి పందెం వాగుపై స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.