20-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కాలే యాదయ్య
చేవెళ్ల, నవంబర్ 19 (విజయక్రాంతి) : దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాలర్పించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ... దేశ ప్రధానిగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
రూపాయి మూల్యాంకణం, రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ వంటి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. సామాజిక, రాజకీయ,సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో రాణించిన ఇందిరా గాంధీ భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. ఆమె స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమం పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
ఘట్‌కేసర్‌లో..
ఘట్‌కేసర్, నవంబర్19 (విజయక్రాంతి): స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని మేడ్చల్ నియోజకవర్గం బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. బుధవారం స్వర్గీయ ఇందిరా గాంధీ 108వ జయంతి వేడుకలను ఉమ్మడి ఘట్ కేసర్ మండలంలో ఘనంగా నిర్వహించారు.
ఘట్ కేసర్ పట్టణంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాలు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవేడుకలకు ముఖ్య అతిథిగా బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్యయాదవ్ విచ్చేసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందిరా గాంధీ గరీబ్ హటావో నినాదంతో బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాల ను తీసుకువచ్చి ఆదుకుందన్నారు.
ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ సభ్యులు మచందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్క సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కె. నాగరాజు, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముది రాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, నాయకులు కొంతం అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్ రెడ్డి, కబాడీ మాధవరెడ్డి, బొక్క సత్తిరెడ్డి, మేకల దాసు, కేశవపట్నం ఆంజనేయులు, శశిధరన్, ఎం. శ్రీనివాస్, మేకల సునీల్ కుమార్ పాల్గొన్నారు.
భారత నారీశక్తిని ప్రపంచానికి చాటిన మాజీ ప్రధాని ఇందిరగాంధీ....
కందుకూరు, నవంబర్ 19 ( విజయక్రాంతి) : భారత నారీశక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన తొలి మహిళా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని కందుకూరు మండల మాజీ జడ్పిటిసి బొక్క జంగారెడ్డి కొనియాడారు. బుధవారం కందుకూరు మండలం లో మాజీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇందిర గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించి.. దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రానా ప్రతాప్ రెడ్డి,గంగుల ప్రభాకర్ రెడ్డి,మండల్ కోఆర్డినేటర్ యండి. అఫ్జల్ బేగ్,సురసాని ప్రతాపరెడ్డి,మాజీ ఉపసర్పంచ్ గుండ్ర సుధాకర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ సరికొండ పాండు,బీసీ సెల్ అధ్యక్షులు సరికొండ జగన్,మాజీ వార్డు సభ్యులు సురసాని రామ్ రెడ్డి,సయ్యద్ అజిత్,వరికుప్పల బాబు,బుక్క పాండురంగారెడ్డి ఎగ్గిడి కృష్ణ,కందుకూరు గ్రామ శాఖ అధ్యక్షులు గాదే కుమార్,ఎఎంసి డైరెక్టర్ అంకగళ్ల దర్శన్,సరికొండ చిన్న జగన్,యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవీణ్, చిందం శ్రీకాంత్,మంగలి ప్రశాంత్ కొత్తగూడ గ్రామ శాఖ అధ్యక్షులు సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు మహమ్మద్ మోహిన్, రమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.