calender_icon.png 20 November, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి శ్రీధర్‌బాబుకు వినతి

20-11-2025 12:00:00 AM

రాజేంద్రనగర్, నవంబర్ 19 (విజయ క్రాంతి) పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని  రంగారెడ్డి ఇంచార్జి,ఐటీ, పరిశ్రమల శాఖ  మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబుకు టూ యూడబ్ల్యూజే రాష్ట్ర ష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా లు బుధవారం వినతి పత్రం అందజేశారు.  బుధవారం రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ ఆవరణలో నూతన భవన ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని పలువురు జర్నెస్‌లో మర్యాదపూర్వకంగా కలి శారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా  పరిధిలో వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో సంవత్సరాలుగా అంకిత భావంతో పని చేస్తున్న జర్నలిస్టులు పలు సమస్యల్లో తో ఇబ్బందులు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అను నిత్యం ప్రజలు ప్రభుత్వాన్ని వారధిగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కారంలో ముందుండే జర్నలిస్టులు తమ సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నారని చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న  ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు ప్రభుత్వ గుర్తింపు కార్డులు, విద్య సంస్థ లో రాయితీ లు అమలు కాకుండా ఇబ్బందులు గురవుతున్నారన్నారు.

జిల్లాలో ఇప్పటికే పలువురు జర్నలిస్ట్ లు సరైన వైద్య సదుపాయాలు అందకా ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్త్ కార్డులతో పాటు, భీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ వి 6 రిపోర్టర్ నర్సింగ్ రావు గుండె పోటుకు గురై స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, షాబాద్ మండలానికి చెందిన రిపోర్టర్ రాములు గుండె పోటుతో మృతి చెందారని వారి కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. పలు సమస్యల పై  మంత్రి సా నుకూలంగా స్పందించారు. మంత్రిని కలిసిన వారిలో జిల్లా దాడుల నివారణ కమిటీ సభ్యులు భీమయ్య, సీనియర్ నేతలు సూర్యనారాయణ, రాజేందర్ రెడ్డి, రాజు, విష్ణు ల, రాము, శేఖర్ రెడ్డి,నరేందర్,బాలు, లక్ష్మినారాయణ,ఎం విజయ్, తదితరులు ఉన్నారు.