04-09-2025 12:32:49 AM
ములకలపల్లి, సెప్టెంబర్ 3, (విజయ క్రాంతి):సీఎం రేవంత్ రెడ్డి సభకు ములకలపల్లి మండలం నుంచి బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. వీరితోపాటు మండలంలో ఇందిరమ్మ లబ్ధిదారులైన మహిళలకు బస్సులు ఏర్పాటు చేసి చండ్రుగొండ మండలంలోని పోకల గూడెంలో నిర్వహించిన ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమానికి తరలించారు.
మండలంలోని 20 గ్రామ పంచాయతీల నుంచి మహిళా లబ్ధిదారులతో పాటు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాహనాల్లో భారీగా తరలి వెళ్లారు. ములకలపల్లి కి సరిహద్దు మండలం అయిన చంద్రుగొండ మండలం పోకల గూడెం, దామరచర్ల గ్రామాల్లో సీఎం రేవంత్ రెడ్డి సభలు ఉండడంతో మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా జనసమీకరణచేశారు.