calender_icon.png 4 September, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరసనలు కేంద్ర ప్రభుత్వంపై తెలపాలి

04-09-2025 12:33:22 AM

కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి

కల్వకుర్తి, సెప్టెంబర్ 3 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పు ష్కర కాలమైనా ప్రజలకిచ్చిన హామీలు అమ లు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఆ పార్టీ నేతలు బీజేపీ హామీలపై  నిరసన తెలపాలని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

దేశంలోని కింది స్థాయి వర్గాల అభివృద్ధి కోసం ప్రధాని మో దీ ఏనాడైనా ఆలోచించారా అని బీజేపీ నాయకులను ప్రశ్నిం చారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రా మాల్లో జరుగుతున్న పనులు బీజేపీ కార్యకర్తలకు కనిపించడం లేడా అని ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకున్నా మాట్లాడని నాయకులు నేడు నిరసనలు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి కొరకు నిరసనలు చేపట్టిన బిజెపి, రైతులు ఎదుర్కొంటున్న యూరి యా సమస్యను ఎందు కు పరిష్కరించడం లేదో ప్రజలకు సమాధా నం చెప్పాలన్నారు.

ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తెలంగాణలో మరో పార్టీకి అవకాశం లేకుండా కాంగ్రెస్ ప్రభు త్వం అధికారం చేపడుతుందని భీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి టౌన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు చంద్రకాంత్ రెడ్డి, పుస్తకాల రాహుల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.