calender_icon.png 19 May, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి

19-05-2025 12:00:00 AM

గూడూరు. మే 1౮: (విజయ క్రాంతి)అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లను కేటాయిం చాలని ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో అధికార పార్టీ నాయకుల హస్తం లేకుండా చూడాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గజ్జి లింగన్న అన్నారు.  మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఆయన ఎమ్మార్వో కార్యాలయంలో తహసిల్దార్ కు మెమోరండం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఇందిరమ్మ ఇండ్లను నిరుపేదలకు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని కాంగ్రెస్ పథకంగా మార్చేశారని అన్నారు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను వేసి ఎలాంటి పద్ధతులు పాటించకుండా గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహించకుండానే ఇష్టారాజ్యంగా ఇంధన మహిళ కేటాయింపులు చేస్తున్నారని ఆరోపించారు.

గ్రామసభల్లో అర్హులైన లబ్ధిదారుల పేర్లు చదివి ఫైనల్ లిస్టులో వారి పేర్లు లేకుండా గుట్టు  చప్పుడు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేర్లు రాయించుకుని ఎమ్మెల్యే ఇన్చార్జి మంత్రుల సిఫారసులతో లిస్టు ఫైనల్ చేయిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో భారీగా అవినీతి చోటు చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఎంపిక చేసిన ఇందిర మహిళను రద్దుచేసి నిరుపేదలైన అర్హులైనటువంటి పారదర్శకంగా అందించాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కొట్టెం అచ్చన్న వెనుక భరత్ ఎడంపాక శ్రీశైలం కొట్టెం వర్జన్న అడ్డూరి వెంకన్న కాదబోయిన నరసయ్య బోస్ రజిత సతీష్ ఆదినారాయణ యోగి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.