calender_icon.png 19 May, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతి ఒక్కరీ సొంతింటి కలను నిజం చేస్తాం

19-05-2025 12:00:00 AM

పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక 

మంత్రి సీతక్క 

మహబూబాబాద్, మే 18 (విజయ క్రాంతి): అర్హులైన పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా జగన్న పేటలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి చేశారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పేదల సొంతింటి కల నిజం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత లబ్ధిదారుల ఎంపికను అధికారులు పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. కాంగ్రెస్ అంటే సంక్షేమానికి మారుపేరు అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల పక్షపాతి అని తెలియజేశారు.

గత ప్రభుత్వ పాలనలా కాకుండా, ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని తెలిపారు. ఎలాంటి మోసం లేకుండా ప్రత్యేక అధికారులతో సర్వేచేయిస్తూ అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామన్నారు. పేదలు నిర్మించుకునేందుకు ప్రజా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను ఉచితంగా సబ్సిడీ కింద అందిస్తుందని, దేశంలో మరే రాష్ట్రంలో ఇంత పెద్దన సాయం అందడం లేదని, మిగిలిన రాష్ట్రాల్లో లక్షన్నర నుంచి 3 లక్షల వరకు ప్రభుత్వాలు సహాయం చేస్తుంటే మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలను అందిస్తుందని మంత్రి తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. అలాగే 175 మంది మహిళలకు మహిళాభివృద్ధి శాఖ ఆర్థిక సహకారంతో డేటా ప్రో సంస్థ శిక్షణా సంస్థ సహకారంతో కుట్టు శిక్షణ ఇచ్చి 15 వేల చొప్పున కేటాయించి 30 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేపట్టిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, జిల్లా సంక్షేమ అధికారి శిరీష, ఎంపీడీవో రామకృష్ణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.