calender_icon.png 1 November, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయవంతంగా రన్ ఫర్ యూనిటీ

31-10-2025 10:10:48 PM

చిన్న చింతకుంట: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.   మండలకేంద్రంలోని వెటర్నరీ హాస్పిటల్ నుండి  రైస్ మిల్ వరకు   నిర్వహించిన “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమంలో విద్యార్థులు,యువత పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్నచింతకుంట మండల ఎస్సై ఓబుల్ రెడ్డి  మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు.“రన్ ఫర్ యూనిటీ” వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందుతుందని పేర్కొన్నారు. యావత్ భారతావనిలోని ప్రజలందరూ ఒకే కుటుంబ సభ్యులుగా భావించి,జాతి ఐక్యతకు పునరంకితమై,మాతృదేశ సేవలో తమ వంతు పాత్ర పోషించడం ద్వారానే స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని అన్నారు. కార్యక్రమంలో ప్రజల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.