28-08-2025 10:35:35 PM
గుమ్మడిదల: పేదల కలను నెరవేర్చడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ళను కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం వారి కలలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళతో వారి కనులలో సంతోషాన్ని నింపుతున్నారు. అదే క్రమంలో గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి వార్డు గతంలో ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో కేవలం రెండు ఇండ్లు మాత్రమే రావడంతో గ్రామస్తుల అభ్యర్థన మేరకు మరల సర్వే నిర్వహించి అర్హులైన 56 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను సాంక్షన్ చేయించి అట్టి మంజూరు కాబడిన ప్రిసైడింగ్ కాపీలను గురువారం మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి మున్సిపల్ కమిషనర్ దశరథ్ ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు.
ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ, మంజూరి పత్రాలు తీసుకున్న వారాంధరు వెంటనే పదిహేను రోజుల్లో ఇంటి నిర్మాణం పనులకు భూమి పూజ చేయాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సురభి నాగేందర్ గౌడ్,నాయకులు ఆలేటి శ్రీనివాస్ రెడ్డి,సద్ది విజయభాస్కర్ రెడ్డి,సంజీవరెడ్డి, పొన్నబోయిన లక్ష్మీనారాయణ, బిక్షపతి రెడ్డి,కాడనోళ్ల సుదర్శన్,శంకర్ యాదవ్, నాగేష్ గౌడ్, సురభి వినోద్ గౌడ్,ఎండి ఆజామ్,ఎం.శ్రీనివాస్,మహిళలు తదితరులు పాల్గొన్నారు.