28-08-2025 10:37:39 PM
ఒక గేటు ఎత్తి 5000 క్యూసెక్కుల నీరు విడుదల
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ మండల పరిధిలోని యానంబయలు వద్ద గల కిన్నెరసాని జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. గురువారం రాత్రి 8 గంటల వరకు జలాశయం నీటి మట్టం 404.50 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 407 అడుగులు. దీంతో జన్కో అధికారులు ఒక గేటు అయిదు అడుగుల ఎత్తు ఎత్తి 5000 క్యూసెక్కుల నీటిని బయటికి పంపుతున్నారు.