28-08-2025 10:33:42 PM
ఎస్ఐ యుగేందర్ గౌడ్..
వలిగొండ (విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేవారు పోలీస్ శాఖ తెలియజేసే నియమ, నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని వలిగొండ ఎస్ఐ యుగేందర్ గౌడ్(SI Yugender Goud) అన్నారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలోని వైఎస్ సి ఏ యువజన సంఘం ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ మండపం వద్ద పోలీస్ శాఖ వారి నియమ నిబంధనల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని అన్ని గణేష్ ఉత్సవ మండపాలకు నియమ నిబంధన తెలియజేసే పోస్టర్ ను అందించడం జరిగిందని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వాటిని పాటించి ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని ప్రజలకు, భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా భారీ శబ్దాలు చేసే డిజే లను ఏర్పాటు చేయవద్దని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సి ఎ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.