calender_icon.png 2 May, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల్లో రాణించాలి

02-05-2025 12:47:00 AM

విర్కో ఫౌండేషన్ ద్వారా రూ. 1.65 లక్షలను అందజేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రాజాపూర్ మే 1 : గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు.  విర్కో ఫౌండేషన్ ద్వారా రూ 1.65 లక్షల చెక్కును గురువారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేసినట్లురాజాపూర్ మండలం ఇదిగానిపల్లి గ్రామానికి చెందిన రామని అశోక్ తెలిపారు .నివాస్ స్పోరట్స్ క్లబ్ హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్న రామని అశోక్  సహాయం చేయాలని ఇదిగానిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులను సంప్రదించగా..

వారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా ఎమ్మెల్యే స్పందిస్తూ.. విర్కో ఫౌండేషన్ ద్వారా రూ 1.65 లక్షలు సమకూర్చినట్టు తెలిపారు. తాము అడగగానే క్రీడాకారులను   ప్రోత్సహిస్తూ సహాయం అందజేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి ఈ సందర్భంగా రామని అశోక్  అతని తల్లిదండ్రులు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పంచాక్షరి, ఇదిగానిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఏర్పుల జంగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, పీసీసీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ కావలి శివకుమార్, ఇదిగానిపల్లి గ్రామ బీసీ సెల్ గ్రామ అధ్యక్షులు కుమ్మరి రాములు తదితరులు పాల్గొన్నారు.