02-05-2025 12:46:16 AM
తుర్కయంజాల్, (మే 1): తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే)ను ఘనంగా జరుపుకొన్నారు. తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి యాదయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు కాడిగళ్ల భాస్కర్ మాట్లాడుతూ మేడే పోరా ట స్ఫూర్తితో కార్మికులంతా ఏకమై హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఓరుగంటి యాదయ్య మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను బీజేపీ సర్కార్ తుంగలోకి తొక్కిందన్నారు. బ్రాహ్మణపల్లి, కోహెడ సురవరం కాలనీలో రంగారెడ్డి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు, సీపీఐ సీనియర్ నాయకులు కొంతం మాధవరెడ్డి ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు.