calender_icon.png 2 May, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రతా దళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారా?

01-05-2025 11:35:49 PM

పహల్గాం ఉగ్రదాడిపై సుప్రీంకోర్టులో పిటిషన్... 

విచారణకు తిరస్కరించిన అత్యున్నత ధర్మాసనం...

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పిటిషన్‌పై విచారణ చేపట్టడానికి సుప్రీం తిరస్కరించింది. ఇలాంటి వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల స్థుర్యైన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా అని కోర్టు పిటిషనర్‌కు మొట్టికాయలు వేసింది. ‘ఇది చాలా క్లిష్ట సమయం. ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలి. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతతో వ్యవహరించండి. అందులో సున్నితత్వాన్ని అర్థం చేసుకోండి.

ఇలాంటి చర్యలతో మన బలగాల స్థుర్యైన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా? మీక్కూడా దేశంపై బాధ్యత ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇలాంటి అంశాలను న్యాయ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించొద్దు. ఉగ్రవాద ఘటనలపై విచారణకు జడ్జీలు నిపుణులు కారు’ అని ధర్మాసనం వెల్లడించింది. అయితే ఇతర రాష్ట్రాల్లో కశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే తాను ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్టు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల కోసమే అయితే హైకోర్టులకు వెళ్లొచ్చని తెలిపింది. కోర్టు సూచనలతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.