13-09-2025 01:07:37 AM
గద్వాల నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం
లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేత
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల్ సెప్టెంబర్ 12: గద్వాల నియోజకవర్గ అభివృద్ధి దిశగా ముందుకు వెళుతున్నానని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన వారికి ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు సొంత ఇంటి లేక గుడిసెలో నివసిస్తున్న వారికి ప్రభుత్వం ఐదు లక్ష రూపాయలు ఖర్చుపెట్టి ఇందిరమ్మ ఇళ్ల ను కట్టించి ప్రతి ఒక్క పేద ప్రజల సొంతింటి కలను నెరవేస్తుందన్నారు. గద్వాల్ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇండ్లు మంజూరు కాగా గద్వాల పట్టణంలో 138 మందికి లబ్ధిదారులకు మొదటి విడతలో కేటాయించడం జరిగిందన్నారు.
ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని అర్హుల ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు.గద్వాల నియోజకవర్గంలోని ప్రజలు నన్ను రెండోసారి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారి భాస్కర్ , జంబు రామన్ గౌడ్, గడ్డం కృష్ణారెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కాబర్ మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.