calender_icon.png 13 September, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రోన్ సహాయంతో పత్తి పొలంలో నానో పిచికారీ

13-09-2025 01:08:10 AM

టేకులపల్లి, సెప్టెంబర్ 12,(విజయక్రాంతి): టేకులపల్లి మండలకేంద్రంలోని మామిడిపల్లి శ్రీను ప్రత్తి పొలంలో డ్రోన్ ద్వారా నానో యూరియా, నానో డి ఏ పి ని పిచికారి చేసి రైతులకు శుక్రవారం డెమోను ప్రదర్శించారు. ఈ సందర్బంగా వ్యవసాయాధికారులు మాట్లాడుతూ.. ఇఫ్కో యూ రియాను రైతులు నాలుగు బాటిల్స్ కొని బి ల్లు భద్రపరచుకోవడం వలన రైతు ప్రమాద వశాత్తూ మరణించినప్పుడు రూ.రెండు లక్ష ల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చని తెలిపా రు. నానో యూరియాను పిచికారి చేయడం వలన భూమి, వాయు కాలుష్యం తగ్గించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి వేల్పుల బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ బి. సరిత, టేకులపల్లి ఏవో అన్నపూర్ణ, ఏఈవో లు శ్రావణి, విశాల, రైతులు పాల్గొన్నారు.