calender_icon.png 22 September, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఐపిఎస్ విద్యార్థులు

22-09-2025 05:02:17 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ కృష్ణప్రియ సోమవారం  తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల కరీంనగర్లో జరిగిన షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో తమ విద్యార్థులు పాల్గొన్నారని, వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఎస్ నిఖిల్, ఏ అద్వైత్, ఎం అక్షిత్, సాయి చరణ్, డి ప్రియదర్శిని, పి లికిత, జి గాయత్రి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ పోటీలు ఈనెల 22,23,24 తేదీలలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని,క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, శివ, సతీష్, మమత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.