calender_icon.png 1 November, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నొదిలి.. కలనొదిలి..

01-11-2025 12:02:05 AM

అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ’12 ఏ రైల్వే కాలనీ’. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ‘పోలిమేర’ సిరీస్‌తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. సాయికుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్‌కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో టీమ్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ శుక్రవారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘కన్నొదిలి కలనొదిలి’ని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ గీతాన్ని హేషమ్ అబ్దుల్ వహాబ్ ఆలపించగా, దేవ్ పవార్ సాహిత్యం అందించారు. ఈ పాటలో అల్లరి నరేశ్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల మధ్య కెమిస్ట్రీ లవ్లీగా ఉంది. ఈ చిత్రానికి డీవోపీ: కుశేందర్ రమేశ్‌రెడ్డి; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; ఎడిటర్, డైరెక్టర్: నాని కాసరగడ్డ.