calender_icon.png 26 December, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

23-04-2025 06:19:35 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్...

కామారెడ్డి (విజయక్రాంతి): అర్హత కలిగిన కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా లింగం పేట్ మండల కేంద్రంలోని బిసి కాలనీకి చెందిన ఇబ్రహీం, మమత రేకుల షెడ్ ను కలెక్టర్ పరిశీలించారు. తాను కూలీ పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాను అని, తన భర్త మరణించాడని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనీ కలెక్టర్ ను కోరారు. ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్ ను తొలగించి, అదే స్థలంలో ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఇల్లు నిర్మించుకుంటానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.