calender_icon.png 26 December, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు

23-04-2025 06:22:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో సమిష్టి కృషితో మెరుగైన ఫలితాలు సాధించామని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు(District Education Officer Rama Rao) అన్నారు. బుధవారం మామడ మండలంలోని కొరటికల్ గ్రామంలో విద్యా సంవత్సరపు ముగింపు కార్యక్రమానికి హాజరై విద్యార్థులను అభినందించారు. పోషకులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య మంచి భోజనం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.