calender_icon.png 2 August, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు పథకం ఓ అద్భుతం

01-08-2025 12:00:00 AM

ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ

ఖమ్మం, జూలై 31 (విజయక్రాంతి): భారతదేశ చరిత్రలోనే ఇందిరమ్మ ఇల్లు పథకం సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక అద్భుతం అని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ నీరజ తెలిపారు. గురువారం ఖమ్మం నగరం లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, సీఎం రిలీఫ్ ఫండ్ చె క్కుల ఇంటి ఇంటికి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ నీరజ మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు జిల్లా సమగ్ర అభివృద్ధి చేయడమే కాకుండా,

రాష్ట్ర మొ త్తం సాగునీటి తాగునీటి వనరుల కల్పనకు అవసరమైన అనేక పథకాలు మంజూరు చేయించారని, నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జిల్లా సాగునీటి పథకాలపై చర్చించారని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు ఖమ్మం నగరంలో మున్నేరు వరద ముంపు ప్రాంతాలు డ్రైనేజీ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు.

కార్యక్రమంలో నగర పాలక సంస్థ వైస్ మేయర్ పాతిమ జోహార్, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు త్రీ టౌన్ ఏరియా కాంగ్రెస్ పార్ట కోఆర్డినేటర్ యర్రం బాలగంగాధర్ తిలక్, ఓబీసీ సేల్ అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్ నాయకులు కన్నo ప్రసన్న కృష్ణ, రమేష్ గౌడ్, గజ్జి సూర్యనారాయణ, బె డదమ్ సత్యనారాయణ, లక్కీ ఉపేందర్, బొమ్మ ఉదయ్, అరవపల్లి శివ, గుంజకొండలు వల్లపు రమేష్, బొమ్మ నాగార్జున తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.