27-09-2025 06:45:32 PM
అదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): పేదవారి కలలను నిజం చేయడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేలు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కోడూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ, నిర్మాణం పనులను కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సామా అభిషేక్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదలందరికీ అందేవిధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.