23-07-2025 12:00:00 AM
కొత్తపల్లి, జూలై22(విజయక్రాంతి): కొత్తపల్లి లోని సెయింట్ జార్జ్ స్కూల్ లో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం. మా దకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా, షీ టీం సేవలు వాటి వినియోగం, సైబర్ నేరాలు జరిగే తీరు మరియు ట్రాఫిక్ నియమాలు వంటి అంశాలపై కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మార్గదర్శం చేశారు. కార్యక్రమంలో పా ల్గొన్న విద్యార్థులు అధికారులంతా ప్రతిజ్ఞ చేసారు. కార్యక్రమంలో సెయింట్ జార్జ్ స్కూల్ చైర్మన్ ఫాతిమా రెడ్డి, ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, శ్రీలత, శ్రీనివాస్, నిరంజన్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.