09-05-2025 02:26:42 AM
పెన్ పహాడ్, మే 8 : దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించడం అన్న సామెతలా మారిపోయింది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలోనే కాదు పల్లెల్లో ’గూడు లేక.. కూడు లేక’ పేద ప్రజలు అలమటించడం.. గత ప్రభుత్వాలు పేద ప్రజల పట్ల చూపిన నిర్లక్ష్యంను చూపకూడదనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు పథకాలు ప్రకటించి సకాలంలో అమలుకు శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగానే ’ఇందిరమ్మ ఇళ్లు’ పథకానికి జనవరి 26న మండలంలోని దుబ్బతండాలో అధికారులు, పాలకులు కలసి లాంఛనంగా ప్రారంభించారు. మండలంలోని దుబ్బతండాను మోడల్ గ్రామ పంచాయతీలో ఇల్లు లేని 18 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతి పత్రాలు అధికారులు అందజేశారు. అంతకు ముందే మండల స్థాయి అధికారులతో మండల కేంద్రములోని తహసీల్దారు కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ భూమిలో ’ఇందిరమ్మ నమూన’ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఇంటి నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ లేక పోవడం.. హౌజింగ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణ పనలు చేపడుతున్నారు. అయితే సదరు ఏఈలు మాత్రం నిర్మాణానికి అన్యూన్య కాంట్రాక్టర్ కు రహస్యం గా ఒప్పందం కుదరడంతో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాదు నమూన ఇంటి నిర్మాణ పనులు నెలల తరబడి సాగుతుండడం.. నాణ్యత లోపించడం.. క్యూరింగ్ లేకపోవడం.. అధికారుల పట్టింపు లేక పోవడంతో ఇందిరమ్మ నమూన ఇంటికి గ్రహణం పట్టినట్టుగా ఉందనే చెప్పవచ్చు.
మొండి గోడలతో నమూన ఇల్లు
నిజంగా అధికారుల నిర్లక్ష్యమా.. కాంట్రాక్టర్ ఘనకార్యమా.. లేదా నమూన ఇంటి నిర్మాణానికి బడ్జెట్ విడుదల కాకపోవడంతో ఇందిరమ్మ ఇల్లు మొండి గోడలకు పరిమితం అయి ఉండవచ్చని మండల ప్రజలు నుంచి ఆరోపనలు వెలువడుతున్నాయి. మండలంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాల్సిన లబ్దిదారులు ప్రభుత్వ నామ్స్ ప్రకారం 600 గజాలలోనే ఇల్లు నిర్మించుకోవాలని కొలతలు తక్కువైనా..
ఎక్కువైనా బిల్లులులు చెల్లించేది లేదని ఉన్నత అధికారులు, పాలకులు పత్రికలు, టీవీల ద్వారా తేల్చి చెప్పడంతో లబ్దిదారులు అయోమయంలో పడ్డారు. ఈమేరకు మండల కేంద్రములో ఉన్న ఇందిరమ్మ నమూన ఇల్లును చూడడానికి నెలల తరబడి తిరుగుతున్నా నమూన ఇల్లు నత్తనడకగా సాగుతుండడంతో ప్రస్తుతం మొండి గోడలతో స్లాబ్ లెవల్ కే దర్శనం ఇవ్వడంతో లబ్దిదారులు మండల కేంద్రం చుట్టూ ప్రతిక్షనలు చేయడంతో అసలుకు నమూనా ఇంటికే బిల్లులు రాకపోవడంతో నిర్మాణ పనులు నత్త నడకగా సాగుతుండవచ్చని లబ్దిదారులు ఆలోచనలో పడుతున్న ట్లు పలు ఆరోపనలు మిన్నంటుతున్నాయి.
నిత్యం మండల స్థాయి అధికారులు, జిల్లా అధికారులు పర్యవేక్షణ ఉన్న చోటనే ఇందిరమ్మ నమూన ఇల్లు పనులు నిర్లక్ష్యంగా సాగుతుండడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు గుస గుసలాడుతున్నారు. ఇప్పటటికైనా ఉన్నతాధికారు లు స్పందించి ఇందిరమ్మ నమూన ఇల్లు పనులు పూర్తి చేసి లబ్దిదారులకు అవగహన కల్పించి ప్రజలపై ఉంచిన ప్రభుత్వ నమ్మకాన్ని ఒమ్ముకాకుండా చూడాలని అధికారుల ను మండల ప్రజలు, ఆయా గ్రామాల ఇందిరమ్మ కమిటీ సభ్యులు కోరుతున్నారు.
అదనపు బాధ్యతలు ఉండడం జాప్యం అయింది
సూర్యాపేట తో పాటు తుంగతుర్తి నియోజకవర్గం ఉండడం పర్యవేక్షణ జాప్యమైంది. హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నమూనా ఇండ్ల నిర్మాణం జరుగుతుంది. నిర్మాణాల కోసం ఎక్కడ కాంట్రాక్టర్ కు ఇవ్వలేదు.
రాంబాబు , హౌసింగ్ ఏఈ