calender_icon.png 19 December, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ మున్సిపాలిటీగా ఇంద్రేశం

18-12-2025 12:00:00 AM

  1. రూ.15 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
  2. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, డిసెంబర్ 17 : నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీని అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్ర ణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు న్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఇం ద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తు న్న 56 మంది పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా యూనిఫామ్ అందజేశారు. అనంతరం ఆరు గ్రా మాలకు చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పరిపాలన వికేంద్రీకరణ ఆర్థిక అభ్యున్నతి సమ గ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నూతన మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఇం ద్రేశం మున్సిపల్ పరిధిలోని గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఇంద్రేశం కేంద్రంగా నూతన మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు..సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని తెలిపారు.

తొలి విడతగా ఇంద్రేశం మున్సిపల్ అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.  ప్రతి వార్డులో మౌలిక వస తుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతోపాటు ఆస్తులు, భూముల విలువలు పెరుగుతాయని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మొదలు పారిశుద్య కార్మికుల వరకు ప్రతి రోజు వారికి కేటాయించిన వార్డుల్లో పారదర్శకంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని కోరారు.

పట్టుదలతో పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు అన్నారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు స్థానిక పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ సంస్థల ద్వారా సిఎస్సార్ నిధులు కేటాయిస్తామని తెలిపారు. అనంతరం మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమిషనర్ మధుసూద న్ రెడ్డి, డిఈ వెంకటరమణ, సిఐ వినాయక్ రెడ్డి, మాజీ సర్పంచ్ బండి హరిశంకర్, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.