10-01-2026 12:21:09 AM
తుర్కయంజాల్, జనవరి 9: తుర్కయంజాల్ లోని ఇండస్ వ్యాలీ పాఠశాల వార్షికోత్సవం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. నటుడు మోటివేటర్ కె. వి.ప్రదీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో అలరిం చాయి.
విజేతలైన చిన్నారులకు నిర్వాహకులు బహుమతులను ప్రధానం చేశారు. పాఠశాల యాజమాన్యం సుధీర్, రాఘవరెడ్డి, ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.