10-01-2026 12:19:47 AM
మేడ్చల్, జనవరి 9 (విజయక్రాంతి): మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన అక్కడివారిలో జోష్ నింపుతారు. కార్యక్రమాన్ని బట్టి వ్యవహరిస్తూ నవ్వుల కురిపిస్తారు. కుర్రకారు ప్రోగ్రాం అయితే కుర్రోడిలా వ్యవహరిస్తారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో విద్యార్థులతో కలిసి డ్యాన్స్ ఇరగదీశారు. మల్లారెడ్డి డ్యాన్స్‌తో విద్యార్థులు కేరింతలు కొట్టారు.