calender_icon.png 13 August, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీల అభివృద్దే ప్రధాన లక్ష్యం

13-08-2025 12:21:14 AM

- ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, ఆగస్టు 12: నల్లమల్ల అడవుల్లో నివసించే ఆదివాసి చెంచు ల అభివృద్ధే నా ప్రధాన లక్ష్యమని అ చ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నా రు. మంగళవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని అచ్చంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బాదవాత్ సంతోష్, ఐటీడీఏ పీవో రోహిత్ గోపిడితో పాటు హాజరయ్యారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యం నుండి ప్రధాన కోడళ్ళ వెంట చెంచు ఆదివాసులు సంప్రదాయ నృత్యాలతో ర్యాలీ చేపట్టారు.

అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేదికపై ఆదివాసీలను ఉద్దేశించి ప్ర సంగించారు. చెంచు గిరిజన ప్రాంత ఆదివాసీల సమస్యలను పరిష్కరించేందుకు మన్ననూర్ లో త్వరలోనే ఐటీడీఏ పీవోను నియమిస్తామని హామీ ఇచ్చారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పోడు భూముల పట్టా అంశంలో పరిష్కారం చూపుతామన్నారు. టూరిజం హబ్గా నల్లమల్లను అభివృద్ధి చేసి చెంచు గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఆదివాసుల సంక్షేమానికి విశేష ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమాల్లో భాగంగా, అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిర జలసౌర విద్యుత్ పథకం అమలు చేయబడిందని చెంచులకు భూముల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చెంచు ఉద్యోగస్తులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీటిబ్ల్యూఓ, ఐటీడీఏ, అటవీ శాఖ అధికారులు, సంఘాల నాయకులు దాసరి నాగయ్య, దాసరి శ్రీనివాసులు, శంకరయ్య, దాసరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.